ఆదిలాబాద్ లో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖోడద్ కు చెందిన రాకేష్ రెడ్డి సతీమణి రుతుజ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డు కావడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రాకేష్ ద్విచక్ర వాహనంపై దీపాయిగూడకు వెళ్తుండగా ఆదిలాబాద్ లోని గణేష్ మందిరం వద్ద రైల్వే వంతెనలో నుంచి వస్తున్న వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో రుతుజ అక్కడికక్కడే మృతి చెందారు.