సీఎం రేవంత్ రెడ్డి సమగ్ర శిక్షా ఉద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు. కొన్ని రోజులుగా సమ్మె చేపడుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. సీఎం తమకు అపాయింట్మెంట్ ఇవ్వాలన్నారు