ఉమ్మడి జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా సీతక్కనే యథావిధిగా కొనసాగించాలని తుడుందెబ్బ వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేశ్ డిమాండ్ చేశారు. మావల మండలం కొమురం భీం కాలనీలో ఆదివారం ఆదివాసీలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ జిల్లా అంటేనే ఆదివాసీల జిల్లా అని చెప్పే పాలక ప్రభుత్వాలు ఆదివాసీ ముద్దుబిడ్డ మంత్రి సీతక్కను జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రిగా తొలగించడం సరికాదన్నారు. వెంటనే ఆమెను యధావిధిగా కొనసాగించాలన్నారు.