ఈనెల 6న ఆదిలాబాద్ రూరల్ మండలం పొచ్చర జడ్పీ ఉన్నత పాఠశాలలో అండర్ 14 బాలికల జిల్లా స్థాయి కబడ్డీ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్జీఎఫ్ సెక్రెటరీ సిహెచ్. కాంతారావు తెలిపారు. 1-1-2011 తర్వాత జన్మించి, 48 కేజీల లోపు బరువు ఉన్న బాలికలు 14 సంవత్సరాల విభాగంలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. అర్హులైన క్రీడాకారులు సంబంధిత త్రివిక్రమ పత్రాలతో ఉదయం 10 గంటలకు పాఠశాలలో రిపోర్ట్ చేయాలని సూచించారు.