దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పరేడ్ మైదానంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ సంక్షేమ ప్రభుత్వ సలహాదారు మహ్మద్ అలీ షబ్బీర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ గౌస్ ఆలం ఉన్నారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.