బేల మండల వ్యాప్తంగా మహాయోధుడు శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మరాఠా సమాజ్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చత్రపతి శివాజీ సేవలు మరువలేనివని మాజీ గ్రంథాలయ ఛైర్మన్ రావత్ మనోహర్ అన్నారు. వివిధ పార్టీల నాయకులు గంభీర్ ఠాక్రే, మురళీధర్ ఠాక్రే, దత్తానిక్కం, సతీష్ పవార్, మండల ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.