ఆదిలాబాద్ లోని గాంధీ నగర్ లో కుక్కల బెడద ఎక్కువైపోయింది. కాలనీలో శుక్రవారం ఆరుగురిపై వీధి కుక్కలు దాడి చేయ
గా వారికి చేతులకు గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన వారిలో మహిళలు, చిన్నపిల్లలు ఉన్నారు. వీరిని చికిత్స నిమిత్త
ం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు కుక్కల బెడదను నివారించాలని గాంధీనగర్
కాంగ్రెస్ పార్టీ వార్డ్ ప్రెసిడెంట్ సైఫ
ుద్దీన్ మున్సిపల్ కమిషనర్ ఖమర్ కు వినతి పత్రం అందజేశారు.