ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుపాటుతో ఆరుగురు మృతి

85చూసినవారు
ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుపాటుతో ఆరుగురు మృతి
ఆదిలాబాద్ జిల్లాలో భారీ పిడుగులు ప్రజల ప్రాణాలను తీశాయి. గురువారం బేల మండలంలో పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు దుర్మరణం చెందగా.. తాజాగా గాదిగూడ మండలం పిప్రిలో నలుగురు మరణించారు. వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన సమయంలో పిడుగుపడటంతో సిడాం రాంబాయి, పెందూర్ మనోహర్, పెందూర్ సంజన,
భీంబాయి అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరిని ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది

సంబంధిత పోస్ట్