నీటి సమస్యను పరిష్కరించండి: సిపిఎం

80చూసినవారు
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం ఆకుర్ల గ్రామ పంచాయతీ పరిధిలో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు లంక రాఘవులు డిమాండ్ చేశారు. గురువారం గ్రామాన్ని పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడి వివరాలను సేకరించారు. గ్రామంలో నీటి సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. జిల్లా కమిటీ సభ్యులు ఆశన్న తదితరులున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్