ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోనే పురాతన ఆలయాల్లో ఒకటైన జైనథ్ లోని శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయాన్ని ఆదిలాబాద్ ఎస్పీ గౌష్ ఆలం కుటుంబ సభ్యుల సమేతంగా దర్శించుకున్నారు. ముస్లిం మతానికి చెందిన ఎస్పీ అలం స్వయంగా తన మాతృమూర్తి, కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం హిందూ ఆలయాన్ని సందర్శించి, స్వామికి ప్రత్యేక పూజలు చేయడంతో ఎస్పీ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.