జైలు నిర్వహణతో పాటు ఉత్తమ సేవలందించిన ఆదిలాబాద్ జిల్లా సూపరింటెండెంట్ పీ. అశోక్ కుమార్ రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డు అందుకున్నారు. గురువారం స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన వేడుకల్లో అశోక్ కుమార్ కు జైళ్ల శాఖ డీజీపీ డాక్టర్ సౌమ్యామిశ్రా ప్రశంసాపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఆ శాఖ అధికారులు, ఉద్యోగులు అభినందనలు తెలియజేశారు.