జిల్లాలో గుట్కా పై ఉక్కు పాదం: ఎస్పీ

79చూసినవారు
గుట్కా బ్యాన్ నేపథ్యంలో ఆదిలాబాద్ పట్టణంలోని 5 గోడౌన్స్ లో జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఆధ్వర్యంలో పోలీసులు అకస్మిక తనిఖీలు నిర్వహించారు. రూ 77, 60, 586 లక్షల విలువ చేసే నిషేధిత గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిపై రూరల్ పోలీస్ స్టేషన్లో, నలుగురిపై ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. జిల్లా వ్యాప్తంగా నిషేధిత గుట్కాను అమ్మిన, రవాణా చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.