ఎవరైనా రౌడీయిజం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ జీవన్ రెడ్డి హెచ్చరించారు. ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో బంగారిగూడకు చెందిన షేక్ సలీం సోషల్ మీడియాలో బైక్ పై నోట్లో కత్తి పెట్టుకొని ప్రదర్శనలు చేస్తూ వీడియోలు పోస్ట్ చేసిన కారణంగా అతడిపై కేసు నమోదు చేసి ఆదివారం అరెస్టు చేశారు. అతడిపై ఇదివరకే 7 కేసులు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. రౌడీలు ప్రవర్తన మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవన్నారు.