ఫ‌లించిన విద్యార్థుల పోరాటం

57చూసినవారు
బేల మండ‌లం చాంద్‌ప‌ల్లి నుంచి కేవ‌లం ఒకే బస్ రావడంతో కిక్కిరిసిపోయి ప్రయాణం సాగించాల్సి వస్తుందని, దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మండల విద్యార్థులు ఆందోళ‌న‌కు దిగారు. ఒక సర్వీస్ ఉండడంతో సమయానికి మండల కేంద్రంలోని పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లలేక పోతున్నామని వారు వాపోయారు. దీనిపై స్పందించిన ఆర్టీసీ డిపో మేనేజ‌ర్ క‌ల్ప‌న శనివారం నుంచి అదనపు మరో ట్రిప్ పెంచారు. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్