కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలపై సీపీఎం ముందుండి పోరాడుతుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ పేర్కొన్నారు. శనివారం ఆదిలాబాద్ సుందరయ్య భవన్ లో పట్టణ కేంద్ర కమిటీ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జెండాను ఆ పార్టీ సీనియర్ నాయకులు బండి దత్తాత్రి ఆవిష్కరించారు. ఈ నెల 30 వరకు గ్రామ, వార్డ్ పార్టీ మహాసభలు కొనసాగుతాయని వారు పేర్కొన్నారు.