ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని మాజీ విద్యా కమిటీ చైర్మన్ మహమ్మద్ రఫీక్ అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ మండల పరిషత్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉర్దూ మీడియం విద్యార్థులకు తన వంతుగా నోట్ బుక్స్ పంపిణీ చేశారు. పాఠశాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రిజ్వాన తన్వీర్, తదితరులు పాల్గొన్నారు.