ఆదిలాబాద్ జిల్లా మావల మండలంలో ఓ తరగతి గదిలో పాము కనబడటంతో విద్యార్థులు భయంతో పరుగులు తీశారు.
బట్టి సావర్గామ ప్రభుత్వ పాఠశాలలోని 2వ తరగతి గదిలో బీరువాపై శుక్రవారం పాము కనబడడంతో విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. వెంటనే స్కూల్ సిబ్బంది గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో గ్రామంలోని ఓ వ్యక్తి వచ్చి పాములు చంపేసి బయటకు తీసుకెళ్లాడు. పొడుగాటి నిలువెత్తు పాము తరగతి గదిలో కనబడడంతో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు వణికిపోయారు.