ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బోధన పరంగా మరింత మెరుగు పరిచేలా రూం టూ రీడ్ స్వచ్ఛంద సంస్థ పలు కార్యక్రమాలు నిర్వహిస్తుందని డీఈఓ ప్రణీత తెలిపారు. గురువారం ఆదిలాబాద్ లోని డైట్ కళాశాలలో రూం టూ రీడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కాంప్లెక్స్ హెచ్ఎం, తదితరులకు శిక్షణ ఏర్పాటు చేశారు. రూం టూ రీడ్ సంస్థ ఇచ్చే పుస్తకాల వల్ల విద్యార్థుల్లో పఠనాసక్తి పెరుగుతుందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలన్నారు.