మావల పోలీస్ స్టేషన్ ఎస్. హెచ్. ఓ గా సీఐ స్వామి నియమితులయ్యారు. ఇన్నాళ్లు ఎస్. హెచ్. ఓ గా ఎస్ఐ స్థాయి అధికారులు ఉండగా.. ఇప్పుడు సీఐ స్వామిని నియమించారు. శనివారం ఆయన ఆదిలాబాద్ డీపీఓ కార్యాలయంలో ఎస్పీ అఖిల్ మహాజన్‌ను కలిసి రిపోర్ట్ చేశారు. మావల పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని సీఐ పేర్కొన్నారు.