ఆదిలాబాద్ జిల్లాలో నిబంధనలు పాటించని ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని పిడిఎస్యు జిల్లా అధ్యక్షుడు సాయి కుమార్ డిమాండ్ చేశారు. పట్టణంలోని సంఘం కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రయివేటు విద్యాసంస్థలు ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలను నడుపుతున్నారని ఆరోపించారు. వెంటనే విద్యాశాఖ అధికారులు ఇలాంటి పాఠశాలను తనిఖీ చేసి చర్యలు తీసుకోవాలన్నారు.