తలమడుగు మండలం ఎంపీడీఓ కార్యాలయం, బరంపూర్ పాఠశాలలో కొనసాగుతున్న సమగ్ర సర్వే డేటా ఎంట్రీ ప్రక్రియను కలెక్టర్ రాజర్షిషా శుక్రవారం పరిశీలించారు. సమగ్ర సర్వే ఆన్‌లైన్ డేటా ఎంట్రీని ఎలాంటి తప్పులకు తావు లేకుండా కుటుంబ వివరాలను నమోదు చేయాలని సూచించారు. డేటా ఆపరేటర్లు తప్పులు లేకుండా ఎంట్రీ చేయాలని తెలిపారు. డేటా ఎంట్రీ చేసేటప్పుడు ఎన్యుమరేటర్ తప్పని సరిగా దగ్గర ఉండి నమోదు చేయించాలని స్పష్టం చేశారు.