తలమడుగు మండలం లక్ష్మీపూర్ అటవీ ప్రాంతంలో మహిళ మృతదేహం స్థానికంగా కలకలం రేపింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని ఆదివారం పరిశీలించారు. మృతురాలు ఆదిలాబాద్ సుందరయ్యనగర్‌కు చెందిన వందనగా గుర్తించారు. ఇటీవల టూటౌన్ పోలీస్‌స్టేషన్ లో వందన అదృశ్యం కేసు నమోదు కాగా.. పోలీసులు విచారణ చేపట్టారు. అదేవిధంగా ఘటన స్థలాన్ని డీఎస్పీ జీవన్ రెడ్డి, రూరల్ సీఐ ఫణిదర్ పరిశీలించారు.