హైదారాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం స్పోర్ట్స్ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ఆదిలాబాద్ జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. ఆయా విభాగాలలో మెడల్స్ సాధించారు. రాథోడ్ కార్తీక్, హెచ్. కె నగేష్, కే అశ్విని గోల్డ్ మెడల్స్ సాధించగా, రాథోడ్ వంశి, రాథోడ్ విక్రమ్, పెందూరు సతీష్, కాంస్య పతకాలను సాధించినట్లు అథ్లెటిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి రాజేష్ తెలిపారు.