ఆదిలాబాద్ లో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించగా ఆరుగురు పట్టుబడ్డారు. వారి నుంచి రూ. 9,140 నగదు, 6 మొబైల్ ఫోన్స్, కారు, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ సీఐ చంద్రశేఖర్ తెలిపారు. వీరిపై వన్ టౌన్‌లో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. వీరిలో నలుగురు రిటైర్డ్ ఉద్యోగులు కాగా మరో ఇద్దరు సాధారణ పౌరులను అదుపులకు తీసుకొని వన్ టౌన్ లో కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.