ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ శ్యామలాదేవి తో పాటు డిసిఒ లలితను సాంఘిక సంక్షేమ గురుకులాలను పనిచేస్తున్న పార్ట్ టైం ఉపాధ్యాయులు బుధవారం కలిశారు. ఈ సందర్భంగా తమను యధావిధిగా కొనసాగించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఎటువంటి సూచన లేకుండా ప్రభుత్వం తమను తొలగించడం ద్వారా జీవనోపాధిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తమను యధావిధిగా కొనసాగించాలని వారు కోరారు.