పేద ప్రజలను ఆదుకోవడం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ధ్యేయమని డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ అన్నారు. శుక్రవారం ఆసిఫాబాద్ మండలంలోని కుండి గ్రామంలో ఇందిరమ్మ పథకం ద్వారా ఎంపికైన లబ్దిదారులకు ఇల్లు మంజూరు పత్రాలు పంపిణి చేశారు. అనంతరం ఇల్లు నిర్మాణానికి భూమిపూజ చేశారు. నిర్మాణ పనులు యధావిధిగా జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.