దేశపు సంపదను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్పోరేట్ శక్తులకు కట్టబెడుతున్నదని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు సీతారాములు ఆరోపించారు. శుక్రవారం ఆదిలాబాద్ లో నిర్వహించిన సీపీఎం పార్టీ జిల్లా మహాసభలకు ఆయన పాల్గొన్నారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించి, అమరుల స్థూపానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం పార్టీ నివేదికను సభలో ప్రవేశపెట్టారు. మాజి ఎంపి మీడియం బాబురావు, పార్టీ జిల్లా ఇంచార్జ్ రవికుమార్ ఉన్నారు