హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి ఆహార పదార్థాల నమూనాలు సేకరించి పరీక్షలు జరిపిన తర్వాతనే వాటి నాణ్యత వివరాలను ప్రకటించాలని, నాణ్యత పాటించని వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సంతోశ్ అన్నారు. ఆదిలాబాద్‌లోని ప్రెస్ క్లబ్‌లో మాట్లాడారు. పూర్తి స్థాయిలో పరీక్షలు జరపకుండా ఫుడ్ సేఫ్టీ అధికారులు నాణ్యతను నిర్ధారించడంతో హోటల్ యజమానులు నష్టపోతున్నారని పేర్కొన్నారు.