రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. గురువారం స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆదిలాబాద్ కలెక్టరేట్ క్యాంప్ కార్యాలయంతో పాటు కలెక్టరేట్ కార్యాలయంలో జాతీయ జెండాను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అదనపు కలెక్టర్ శ్యామలాదేవి తదితరులున్నారు.