జూనియర్ డాక్టర్ల ఆందోళన తీవ్రం

74చూసినవారు
వైద్య విద్యార్థినిపై హత్యాచారం ఘటన నిరసిస్తూ గత నాలుగు రోజులుగా జూడాలు కొనసాగిస్తున్న ఆందోళనలు శనివారం నాడు మరింత తీవ్రతరం చేశారు. ఆదిలాబాద్ రిమ్స్ వైద్య కళాశాల నుంచి మహా ర్యాలీగా బయలుదేరి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ప్రధాన రహదారిపై మానవహారం ఏర్పాటు చేసి రాస్తారోకో చేపట్టారు. ఆందోళనకు ఐఎంఏ, స్టాఫ్ నర్సుల సంఘం, మెడికల్ రిప్రజెంటేటివ్ల సంఘం మద్దతు ప్రకటిస్తూ ఆందోళనలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్