ఎస్సీ వర్గీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని మాల సంఘం జిల్లా అధ్యక్షుడు కొప్పుల రమేశ్ అన్నారు. వర్గీకరణ పై న్యాయబద్ధంగా పోరాడుతామని తెలిపారు. బుదవారం ఆదిలాబాద్ లోని ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌కి మాలలు తగిన బుద్ధి చెప్తారని స్పష్టం చేశారు. సంఘం అసోసియేట్ అధ్యక్షులు పాశం రాఘవేందర్, శంకర్, స్వామి, అశోక్, పోశెట్టి, తదితరులున్నారు.