కదులుతున్న రైలు నుండి జారిపడి ఆదిలాబాద్ జిల్లా వాసి ఒకరు మృతి చెందినట్లు సమాచారం. ఆంద్రప్రదేశ్ లోని హిందూపురం సమీపంలో గురువారం రైలు లో నుంచి ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. వెంటనే 108 అంబులెన్సు సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొగా, గాయపడ్డ వ్యక్తి తన పేరు కృష్ణ అని, తనది ఆదిలాబాద్ జిల్లా అని చివరగా పేర్కొనట్లు సమాచారం. మృతదేహాన్ని హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రి లోని మార్చురీకి తరలించారు.