బాధితుల వద్దకే వచ్చి సాక్ష్యం సేకరించిన జడ్జి

63చూసినవారు
బాధితుల వద్దకే వచ్చి సాక్ష్యం సేకరించిన జడ్జి
నడవలేని పరిస్థితుల్లో ఉన్న బాధితుల వద్దకే జడ్జి వెళ్లి సాక్ష్యం సేకరించిన అరుదైన ఘనత ఆదిలాబాద్ జిల్లా కోర్టు ఆవరణలో చోటుచేసుకుంది. జమిడి గ్రామానికి చెందిన రాంబాయి, సులోచన లు ఓ కేసు విషయంలో బుధవారం పేషీ ఉండటంతో ఆటోలో కోర్టు కు వచ్చారు. ఐతే అనారోగ్యంతో నడవలేని స్థితిలో ఉన్న బాధితుల విషయాన్ని తెలుసుకున్న పి. సి. ఆర్ కోర్టు జడ్జి దుర్గారాణి బైట బాధితులు ఉన్న ఆటోవద్దకే వచ్చి సాక్ష్యం నమోదు చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్