బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్న కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి శ్రీధర్ బాబు పర్యటనలో భాగంగా తనపై మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కమిషన్లు ఎక్కడ వస్తాయో మాజీ మంత్రికి బాగా తెలుసు అని ఆరోపించారు