ప్రైవేట్ టీచర్ల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తానని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. శుక్రవారం ట్రస్మా ఆధ్వర్యంలో పట్టణంలోని ఎస్టియు భవన్ నిర్వహించిన గురుపూజోత్సవం కార్యక్రమంలో ముఖ్యఅతిథి గా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్, డీఈఓ ప్రణీత, ఎంఈఓ సోమయ్య, తదితరులున్నారు.