‘గేమ్ ఛేంజర్’ సినిమాకు నిరసన సెగ (వీడియో)
విడుదలకు ముందే హీరో రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు నిరసన సెగ తగిలింది. కర్ణాటకలో పలు చోట్ల అంటించిన మూవీ పోస్టర్లపై కలర్ స్ప్రే చల్లుతూ కొందరు నిరసనకు దిగారు. కన్నడలో ‘గేమ్ ఛేంజర్’ సినిమా విడుదలపై ఎలాంటి అప్డేట్ రాకపోవడంతోనే ఇలా చేస్తున్నట్లు సమాచారం. మరికొందరు ఇంగ్లీష్‌లో పోస్టర్లు వేసినందుకు ఇలా స్ప్రే చేస్తున్నారని చెబుతున్నారు. కాగా, ఈ సినిమా జనవరి 10న థియేటర్లలో రిలీజ్ కానుంది.