చిన్నపాటి వర్షానికే జలమయమైన రోడ్లు

67చూసినవారు
ఆదిలాబాద్ పట్టణంలోని రాంనగర్ కాలనీలో శనివారం చిన్నపాటి వర్షానికి రహదారులన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై వర్షపు నీళ్లు నిండి బురద మయంగా మారిందని వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. రోడ్లన్నీ గుంతల మయంగా మారిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్