స్వచ్చ సర్వేక్షన్ లో భాగంగా ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయంలో కార్మికులను బుధవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్, కమిషనర్ ఖమర్ అహ్మద్ కార్మికులను శాలువాలతో సత్కరించారు. పరిసరాలను పరి శుభ్రంగా ఉంచ డం ద్వారా ప్రజా రోగ్య పరిరక్షణలో పారిశుధ్య కార్మి కుల సేవలు వెల కట్టలేనివని పేర్కొన్నారు. ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ స్వచ్చతకు తగు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.