బుద్దిస్టులు పవిత్రంగా భావించే వర్షవాస్ కార్యక్రమం ప్రారంభమైంది. 3 నెలలు చేపట్టే వర్షవాస్ లో భాగంగా ఆదిలాబాద్ లోని అశోక బుద్ధ విహార్ లో ఆదివారం భంతే సంఘమిత్ర ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ముందుగా గౌతమ బుద్ధుడు విగ్రహానికి, అంబెడ్కర్, రమాబాయి అంబెడ్కర్ చిత్ర పటాలకు పూజలు చేసి బుద్ధవందన గావించారు. భారతీయ బౌద్ధ సమాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రజ్ఞ కుమార్, విఠల్, రాందాస్, దయనంద్, తదితరులు పాల్గొన్నారు.