ప్రతి నెల అయిదో తేదీలోగా టూర్ డైరీని సమర్పించాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా స్పష్టం చేశారు. వివరాలు సమర్పించని పలువురు అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ విషయంలో సీరియస్ గా ఉందన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశమయ్యారు. రెండు వారాల్లో పెండింగ్ లో ఉన్న ప్రజావాణి అర్జీలు పరిష్కరించాలన్నారు. అర్జీల పరిష్కారాన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేయడంలో నిర్లక్ష్యం చూపొద్దన్నారు.