డంపింగ్ యార్డ్ వద్ద విధులు నిర్వహిస్తున్న వారిని తొలగించాలి

69చూసినవారు
ఆదిలాబాద్ లోని బంగారిగూడ డంపింగ్ యార్డ్ లో విధులు నిర్వహిస్తున్న వారిని తొలగించి కొత్తవారిని నియమించాలని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. ఈ విషయమై బుధవారం మున్సిపల్ కమిషనర్ ఖమర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. డంపింగ్ యార్డ్ వద్ద అమ్మిన సామగ్రిని రికవరీ చేసి వచ్చిన డబ్బులను మున్సిపాలిటీకి జమ చేయాలని కోరారు. కౌన్సిలర్లు కలాల శ్రీనివాస్, జహీర్, వెంకన్న, రామ్ కుమార్, తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్