భోరజ్ మండలం పిప్పర్ వాడ టోల్ ప్లాజా ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి కిరణ్ పాల్గొని సంఘం జెండాను ఆవిష్కరించారు. టోల్ ప్లాజా కార్మికుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. టోల్ ప్లాజా కార్మికులకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. యూనియన్ అధ్యక్షుడు అక్నూర్ సంతోష్, ముక్కెర ప్రభాకర్, రమేష్ తదితరులున్నారు.