వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్. పి. ఆర్. డి) జిల్లా మూడవ మహాసభలను ఈనెల 17న అదిలాబాద్ లోని సీపీఎం కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు మెస్రం నగేష్ తెలిపారు. శుక్రవారం స్థానిక సుందరయ్య భవన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మహాసభలో దివ్యాంగుల సమస్యలు వాటి పరిష్కారంపై చర్చించడం జరుగుతుందని పేర్కొన్నారు. కావున దివ్యాంగులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.