పాఠశాలలను సందర్శించిన శిక్షణ సివిల్స్ అధికారులు

75చూసినవారు
అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, ఉర్దూ ప్రైమరీ ప్రభుత్వ పాఠశాలను శిక్షణ సివిల్స్ అధికారులు మున్సిపల్ కమిషనర్ ఎండి ఖమర్ అహ్మద్ తో కలిసి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న సదుపాయాలను కమిషనర్ శిక్షణ సివిల్స్ అధికారులకు వివరించారు. అంతకుముందు పాఠశాలలో వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి వారు మధ్యాహ్న భోజనం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్