ఉట్నూర్ మండలంలోని లింగోజీ తండా గ్రామంలో ఉన్న గురుకుల జూనియర్ కళాశాలలో నిరంతర విద్యుత్ ఉండేలా చూడాలని బీఆర్ఎస్వి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు ధరణి రాజేష్ కోరారు. శుక్రవారం ఉట్నూరు పట్టణంలోని సబ్ స్టేషన్ లో స్థానిక ఏఈకి బిఆర్ఎస్, బీఆర్ఎస్వి నాయకులతో కలిసి వినతిపత్రం సమర్పించారు.