ఉట్నూర్: హాస్టళ్లకు నిత్యవసర సరుకులను సరఫరా చేయాలి

67చూసినవారు
ఉట్నూర్: హాస్టళ్లకు నిత్యవసర సరుకులను సరఫరా చేయాలి
ఉట్నూర్: గిరిజన వసతి గృహాలకు వెంటనే నిత్యవసర సరుకులు కూరగాయలు కాస్మెటిక్ సరఫరా చేయాలని జీసీసీ డివిజనల్ మేనేజర్ గుడిమళ్ల సందీప్ కుమార్ ఆదేశించారు. గురువారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా ఆదేశాలతో జీసీసీ ఉమ్మడి జిల్లా మేనేజర్లు, అకౌంటెంట్ లు, గోడౌన్ క్లర్క్ లు, జూనియర్ అసిస్టెంట్ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విధులలో నిర్లక్ష్యం వహించవద్దని వారికి ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్