ఉట్నూర్ మండలం లాల్ టేకిడి గల గురుకుల జూనియర్ కళాశాలకు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయాలని బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు రాజేష్ అన్నారు. ఉట్నూర్ విద్యుత్ శాఖ అధికారులకు బీఆర్ఎస్ నాయకులతో కలిసి వినతి పత్రం అందించారు. ఆయన మాట్లాడుతూ తరచు ఈదురు గాలులతో విద్యుత్ అంతరాయం ఏర్పడుతుండడంతో కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ఇబ్బంది ఉందన్నారు.