ఖానాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సోమవారం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ క్రమంలో ఆయనను మంగళవారం రాష్ట్ర పంచాయతీ రాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అందరు కలిసి కృషి చేద్దామని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ముందంజలో ఉందని సీతక్క కొనియాడారు.