ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అహ్మదాబాద్ విమాన ఘటన మరియు ఆదిలాబాద్ జిల్లాలోని పిడుగుపాటుకు గురై మృతి చెందిన రైతులకు కాంగ్రెస్ నాయకులు ఘన నివాళి ఘటించారు. గురువారం జరిగిన రెండు ఘటనలు బాధాకరమైనవని వారు అన్నారు. మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కొవ్వొత్తులతో నివాళి అర్పించి, మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.