ఇటీవల వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న గోరవాణాను అడ్డుకున్న హిందూ బంధువులు శివ గౌడ్, అరుణ్ లోయ, సమీర్ గుప్తా, లాయర్ విజయ్ కుమార్, తదితర కార్యకర్తలను అక్రమ కేసులు పెట్టి ఆదిలాబాద్ జైల్ లో పెట్టారు. శనివారం అదిలాబాద్ ఎంపీ గోడం నాగేష్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు పలువురు ములాఖాత్ లో కలవడం జరిగింది. వారు మాట్లాడుతూ మూగజీవాల అక్రమ రవాణాను ప్రోత్సహించే సంబంధిత అధికారుల ప్రోద్భలంతో కొనసాగిస్తున్నారన్నారు.